Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ టైటిల్‌తో మెగాస్టార్ చిరంజీవి సినిమా.. ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న టాపిక్

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-07 15:22:00  IST  )

ఆపరేషన్ సిందూర్ ఎగ్జిక్యూషన్ అదిరిపోయింది. ఆర్మీ దళాల శక్తి హనుమంతుడితో పోల్చబడుతుంది. పాక్ కొంచెం ఎక్స్‌ట్రాలు చేసినా..

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ టైటిల్‌తో మెగాస్టార్ చిరంజీవి సినిమా.. ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న టాపిక్
X

దిశ, ఫీచర్స్ : ఆపరేషన్ సిందూర్ ఎగ్జిక్యూషన్ అదిరిపోయింది. ఆర్మీ దళాల శక్తి హనుమంతుడితో పోల్చబడుతుంది. పాక్ కొంచెం ఎక్స్‌ట్రాలు చేసినా.. మరో ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు ఇండియన్స్. అవసరమైతే బార్డర్‌కు వెళ్తామని దేశభక్తితో ఉప్పొంగిపోతున్నారు. కాగా ఆపరేషన్ సిందూర్.. పెహల్గాం ఎటాక్‌లో భర్తలను కోల్పోయిన భారత స్త్రీలకు న్యాయం చేసేందుకు ఇచ్చిన హామీకి మారుపేరుగా పెట్టారు. ఇక ఈ సమయంలో తెలుగు సినిమా ‘సిందూరం’ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ సినిమా రాగా ఆయన ఆలోచనల్లో ఎంత ముందుచూపుందని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. ఈ ఆపరేషన్‌కు మోడీగారు మీ సినిమా పేరు పెట్టుకున్నారు కదా మీ ఆలోచనలను పంచుకోమని అడగ్గా.. ‘‘వందేమాతరం’’ అంటూ స్పందించారు డైరెక్టర్. ఇక హీరో రవితేజతో ‘ఖడ్గం 2’ తెరకెక్కించాలని ఆయన ఫ్యాన్స్ కోరగా.. మా బాస్ చిరంజీవితో ఆపరేషన్ సిందూర్ టైటిల్‌తో సినిమా తీయమని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.

Click For Tweet..

Next Story