- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్: నిర్మాతలకు బిగ్ షాకిచ్చిన కోర్టు.. సినిమా విడుదలపై స్టే!
పాకిస్తాన్ చేసిన ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: పాకిస్తాన్ చేసిన ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో కాల్పులు విరమిస్తున్నట్లు భారత్-పాక్ ఒప్పందం చేశాయి. ఇక ఈ క్రమంలో.. ఈ యుద్ధ ప్రభావం పలు సినిమాలపై పడుతోంది. అయితే భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో ఓ మూవీ థియేటర్స్‌లో విడుదల కావాల్సి ఉండగా.. డైరెక్టర్ ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటన విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మొత్తానికి విడుదల చేయకుండా కోర్టు అనూహ్యంగా స్టే విధించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు(Raj Kumar Rao), వామికా గబ్బి(Wamika Gabbi) జంటగా నటించిన లేటెస్ట్ సినియా ‘భూ ల్ చుక్ మాఫ్’(Bhool Chuk Maaf) . ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మాడ్‌డాక్ ఫిల్మ్స్, దినేష్ విజన్ బ్యానర్స్‌పై నిర్మించారు. అయితే ఈ సినిమా చిక్కుల్లో పడింది. మే 9న థియేటర్స్‌లో విడుదల కావాల్సి ఉండగా.. ఈ సమయంలోనే ఆపరేషన్ సిందూర్ జరగడంతో మేకర్స్ ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లడానికి ఇష్టపడటం లేదని ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమా అసలు ఓటీటీలోకి, థియేటర్స్‌లో ఎక్కడా విడుదల చేయికుండా బాంబే హై కోర్ట్ స్టే విధించినట్లు సమాచారం. పీవిఆర్ సంస్థ ఈ సినిమా కోసం తాము చాలా ఖర్చు చేశామని ఓటీటీలో విడుదల చేయడం సరికాదని రూ. 60 కోట్ల దావా వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై విచారణ జరిగిన కోర్టు ‘భూల్ చుక్ మాఫ్’ విడుదలపై స్టే విధించినట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు అయ్యో పాపం అని అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ మేకర్స్ స్పందిస్తే కానీ అసలు నిజాలు బయటపడవు.






