- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor Effect: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. థియేటర్‌లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన మూవీ (పోస్ట్)
బాలీవుడ్ (Bollywood) విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్ (Raj Kumar Rao) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భూల్ చుక్ మాఫ్’.

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్ (Raj Kumar Rao) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భూల్ చుక్ మాఫ్’. వామికా గబ్బి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈనెల 9న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సి ఉంది. అంతే కాకుండా.. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టగా పలు థియేటర్లలో టికెట్స్ సైతం అమ్ముడయ్యాయి. కానీ, ఇప్పుడు ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఎందుకంటే... ‘భూల్ చుక్ మాఫ్’ (Bhool Chuk Maaf) సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడిన సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) జరిగింది. దీంతో నార్త్ ఇండియాలో ప్రజలు ప్రసుత్తం థియేటర్స్‌కు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. దీనికి తోడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో రిస్క్ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ.. మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు వెనుకడుగు వేశారు. ఇందులో భాగంగానే థియేటర్‌లో కాకుండా ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమోజాన్ ప్రైమ్ వీడియోస్ (Amazon Prime Videos)లో ఈ నెల 16 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.






