- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకటే విధి.. రెండు హృదయాలు.. అతడితో ఉన్న ఫొటో షేర్ చేస్తూ టాలీవుడ్ యంగ్ బ్యూటీ పోస్ట్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రీతు వర్మ(Rithu Verma) గత ఏడాది ‘స్వాగ్’(Swag) సినిమాతో ప్రేక్షకులను అలరించింది. కానీ హిట్ సాధించలేకపోయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రీతు వర్మ(Rithu Verma) గత ఏడాది ‘స్వాగ్’(Swag) సినిమాతో ప్రేక్షకులను అలరించింది. కానీ హిట్ సాధించలేకపోయింది. ఇక ఇటీవల సందీప్ కిషన్(Sandeep Kishan) ‘మాజాకా’ (Mazaka)చిత్రంతో వచ్చిన ఆమెకు మరోసారి నిరాశే ఎదురైంది. అయినప్పటికీ ఈ అమ్మడు హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా వరుస సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. తాజాగా, రీతు వర్మ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. తెలుగులో మొదటి వెబ్‌సిరీస్ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ఇక ఇందులో సూర్యవశిష్ట హీరోగా నటిస్తున్నాడు. ‘దేవిక-డెన్నీ’ (Devika-Denny)పేరుతో రాబోతుండగా.. దీనిని కిశోరుడు తెరకెక్కిస్తున్నారు. ఇందులో సుబ్బరాజు, మౌనిక రెడ్డి, సోనియా సింగ్, సుధా చాగంటి, దీపక్, జై క్రిష్, వెంకట్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సిరీస్ త్వరలో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ రీతు ట్వీట్ చేసింది. అలాగే ఓ పుస్తకం, లంచ్ బాక్స్ పట్టుకుని వర్షంలో గొడుగు పట్టుకుని నడిచి వస్తుండగా.. ఆమె వెనకాలే శివ పడుతున్నట్లు ఉన్న పోస్టర్‌ను షేర్ చేసింది. దీనికి ‘‘తెలుగులో నా ఫస్ట్ వెబ్‌సిరీస్. దేవిక-డెన్నీ త్వరలో మీ ముందుకు రాబోతుంది. రెండు హృదయాలు.. ఒకటే విధి’’ అనే క్యాప్షన్ జత చేసింది.






