- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాహుబలి అసిస్టెంట్ డైరెక్టర్ ‘వన్ బై ఫోర్’.. టేకింగ్ రాజమౌళి స్టైల్‌తో అదుర్స్..
తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్(One/4). బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి

దిశ, సినిమా : తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్(One/4). బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 12న ప్రేక్షకులను పలకరింబోతున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో వెంకటేష్ పెద్దపాలెం.. ‘ టంగ్ స్లిప్ అనే పాయింట్‌తో ఈ క్రైమ్ డ్రామాను తీశాం. మా చిత్రంలో అద్భుతమైన ఆర్టిస్టులు పని చేశారు. హీరోయిన్లంతా కూడా అద్భుతంగా నటించారు. బాహుబలికి పని చేసిన పళని గారి టేకింగ్‌కు అందరూ ఫిదా అవుతారు. రాజమౌళి గారి స్టైల్లో ఈ మూవీని తీశారు. ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టదు. డిసెంబర్ 12న వంద శాతం మేం హిట్ కొట్టబోతున్నాం’ అన్నారు






