- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trending: కోర్టు తీర్పు వచ్చాక మీ నిజస్వరూపం కూడా బయటపడుతుంది.. నటికి షాకిచ్చిన జానీ మాస్టర్ (ట్వీట్)
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస వివాదాలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. లైంగిక వేధింపుల కేసులో సినీ సెలబ్రిటీలు ఇరుక్కుంటూ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు.

దిశ, సినిమా: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస వివాదాలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. లైంగిక వేధింపుల కేసులో సినీ సెలబ్రిటీలు ఇరుక్కుంటూ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారు తప్పు చేశారని తేలనప్పటికీ పలు కేసుల్లో చిక్కుకుంటున్నారు. అయితే, ఇటీవలే స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master)పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులకు గురి చేశారని కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతగా సెన్సేషన్ అయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.
జానీ మాస్టర్ కేసులో జైలు శిక్షను కూడా అనుభవించారు. అనంతరం ఆయనకు తెలంగాణ హైకోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే మళ్లీ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టి కొరియోగ్రాఫర్‌గా యమ బిజీ అయిపోయారు. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న టైంలోనే సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఫిలిం ఛాంబర్‌లో లైంగిక వేధింపుల పరిష్కార కమిటీలో కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఛాంబర్ పెద్దలు వెంటనే కమిటీ విచారణకు ఆదేశించారు. డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్‌ను తప్పించాలని ఫెడరేషన్‌ను ఫిల్మ్ ఛాంబర్ కోరిందని సమాచారం. అయితే, ఈ విషయంలో జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ వేసినట్లుగా, ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసినట్లుగా నటి ఝాన్సీ(Jhansi) పోస్ట్ పెట్టింది. అదేవిధంగా ఫిల్మ్ ఛాంబర్ మంచి నిర్ణయం తీసుకుందని కితాబు ఇస్తూ.. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
తాజాగా, ఇదే విషయంపై జానీ మాస్టర్ సంచలన ట్వీట్ చేశారు. ‘‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసే వారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పును మీకు అనుకూలంగా, నచ్చినట్లుగా మార్చి మరో కేసుతో ముడి పెట్టి పోస్టులు పెడుతున్నారు. మీరేది చెప్పినా జనం నమ్ముతారని అనుకుంటున్నారేమో.. కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన నాడు మీ నిజ స్వరూపం ఏమిటో, దేని కోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని బయటపడుతుంది అందరికీ అర్థం అవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. చివరికి న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది’’ అని ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెజిజన్లు ఝాన్సీ కోసమే పెట్టారని భావిస్తున్నారు.






