మరోసారి ఆదిత్య హాసన్ చిత్రంలో శివాజీ.. ఎలాంటి పాత్రలోనో తెలుసా?

by Pulgam srinivas |

శివాజీ మాట్లాడుతూ... ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎపిక్ చిత్రంలో నేను తండ్రి పాత్రలో కనిపించబోతున్నాను. అందులో నా లుక్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.

మరోసారి ఆదిత్య హాసన్ చిత్రంలో శివాజీ.. ఎలాంటి పాత్రలోనో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ నటుడు శివాజీ చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అలాంటి సమయంలో ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈయన నటించిన 90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది.

దానితో శివాజీకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత శివాజీకి వరుస పెట్టి అవకాశాలు దక్కుతున్నాయి. ఈ నటుడు ఈ మధ్యకాలంలోనే అనేక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే చాలా సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా శివాజీ 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' అనే సినిమాలో నటించాడు. ఈ మూవీని మొదట ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా థియేటర్లలోనే విడుదల చేశారు. నిన్న విడుదల అయిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

ఈ సినిమా విడుదల సందర్భంగా శివాజీ చాలా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఆదిత్య హాసన్ ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న ఎపిక్ చిత్రంలో నేను నటిస్తున్నాను, ఈ సినిమాలో నేను తండ్రి పాత్రలో కనిపించబోతున్నాను. ఆ పాత్రలో నా లుక్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. తండ్రి పాత్రలో ఓ వ్యక్తి ఎలా కనిపించాలో అలా నా లుక్ ఉంటుంది. ఆదిత్య సినిమాను కూడా చాలా బాగా తెరకెక్కిస్తున్నాడు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఎపిక్ చిత్రం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా రూపొందుతోంది.

Next Story