- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి గొప్ప మనసు చాటుకున్న రియల్ హీరో.. వృద్ధ జంటకు ఆ సాయం.. నువ్వు దేవుడివి సామీ అంటూ కామెంట్స్
రియల్ హీరో సోనూ సూద్(Sonu Sood) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: రియల్ హీరో సోనూ సూద్(Sonu Sood) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్‌లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన ‘అరుంధతి’(arundhathi) మూవీలో పశుపతి క్యారెక్టర్‌లో ఇరగదీశాడు. తన నటనతో అప్పట్లో థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలయ్యాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అతను సినిమాల్లో విలన్ అయినప్పటికీ బయట మాత్రం రియల్ హీరో. ఎంతో మందికి సహాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నాడు. అవసరం ఉంది అంటే చాలు ఆపద కన్నా ముందే ఉండి చేయూతనిస్తాడు.
ఈ క్రమంలో తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు సోనూసూద్. వివరాల్లోకి వెళితే.. ఓ వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధ జంట పొలం దున్నుతూ కనిపించారు. అయితే వారి వద్ద ఎద్దు లేకపోవడంతో పెద్దాయన ఎద్దులకు బదులు ఒక నాగలిని కట్టి వ్యవసాయం చేస్తున్నాడు. అయితే ఈ జంటకు ఎద్దులు కొనే ఆర్థిక పరిస్థితి కూడా లేనట్టు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ వీడియో పై తాజాగా సోను సూద్ స్పందిస్తూ వారికి భరోసా నిచ్చారు. సహాయం అందిస్తానని మాటిచ్చాడు.
ఇందులో భాగంగా వ్యవసాయం కోసం అవసరమైన పశువులను వారికి అందిస్తానని చెప్పాడు. అంతేకాకుండా రైతును సంప్రదించి ఒక జత ఎద్దులను ఇస్తానని హామీ ఇచ్చాడు. మీరు నాకు నెంబర్ పంపండి, నేను మీకు కావాల్సిన పాడి పశువులను పంపుతాను అని అతను X లో వీడియోకు ప్రతిస్పందిస్తూ రాశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక సోనూ సూద్ మంచి మనసుకు నెటిజన్లు, ఫ్యాన్స్ నువ్వు దేవుడివి సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Links






