- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Daku Maharaj:ఈనెల 22న ‘డాకు మహారాజ్’ విజయోత్సవ సభ.. ఎక్కడంటే?
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా(జనవరి 12న) విడుదలైన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా(జనవరి 12న) విడుదలైన విషయం తెలిసిందే. దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులు ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
ఈ మూవీ ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా రూ.114 కోట్లకు పైగా వసూళ్లను సాధించి విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో జనవరి 22న అనంతపురంలో ’డాకు మహారాజ్’(Daku Maharaj) విజయోత్సవ పండుగను నిర్వహించనున్నారు. తిరుపతి(Tirupathi) తొక్కిసలాట ఘటన కారణంగా ఈ నెల 9న జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయోత్సవ సభను అనంతపురం(Ananthapuram)లోనే నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. 25 వేల మందితో ‘డాకు మహారాజ్’ విజయోత్సవ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.






