- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతి:’ ట్రైలర్
‘ఓం శాంతి శాంతి శాంతి:’ నిజాయితీగా చేసిన సినిమా అని తెలిపాడు హీరో తరుణ్ భాస్కర్. ఖచ్చితంగా అందరూ ఈ సినిమాని లవ్ చేస్తారని చెప్పాడు. ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ద్వారా ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్

దిశ, సినిమా : ‘ఓం శాంతి శాంతి శాంతి:’ నిజాయితీగా చేసిన సినిమా అని తెలిపాడు హీరో తరుణ్ భాస్కర్. ఖచ్చితంగా అందరూ ఈ సినిమాని లవ్ చేస్తారని చెప్పాడు. ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ద్వారా ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తున్నారు. కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తయి.. పోస్ట్-ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం సినిమా టీజర్‌ను లాంచ్ చేయడం ద్వారా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ టీజర్‌లో కథ అహంకారం, స్వార్థపూరిత స్వభావం గల ధనవంతుడైన చేపల వ్యాపారి అంబటి ఓంకార్ నాయుడు చుట్టూ తిరుగుతుంది. అతను ఓర్పు, సర్దుబాటును కలిగి ఉన్న క్రమశిక్షణ కలిగిన మహిళ కొండవీటి ప్రశాంతిని వివాహం చేసుకుంటాడు. వారి విభిన్న వ్యక్తిత్వాలు ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాకి వేదికగా నిలిచాయి. టీజర్ సూచించినట్లుగా.. ఈ కుటుంబ కథా చిత్రంలో ఊహించని మలుపు ఉంటుంది. జనవరి 23న మూవీ థియేటర్లలోకి రానుండగా.. ఆరోగ్యకరమైన ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు మేకర్స్.






