తరుణ్ భాస్కర్ "ఓం శాంతి ఓం" ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

by Ajay Maddhiboyina |

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించిన ఓంశాంతిఓం సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సినిమాను జనవరి 30న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

తరుణ్ భాస్కర్ ఓం శాంతి ఓం ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించిన ఓంశాంతిఓం సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సినిమాను జనవరి 30న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ చిత్రానికి ఏఆర్ సంజీవ్ దర్శకత్వం వహించగా మలయాళ సినిమా జయజయజయహే సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ విషయానికి వస్తే ఆద్యంతం వినోదాత్మకంగా ఉంది.

దాదాపు జయజయజయహే సినిమా ఉన్నది ఉన్నట్టుగా తీసినట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా సినిమాలో కామెడీ, ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సినిమా కథ ప్రధానంగా ఇషా రెబ్బ, తరుణ్ భాస్కర్ చుట్టూనే తిరుగుతుండగా ఇద్దరూ తమ పర్ఫామెన్స్ లతో అదరగొట్టారు. కోపం ఎక్కువగా ఉండే అబ్బాయితో అమ్మాయికి పెళ్లి చేస్తే తరవాత జరిగే పరిణామాలు, ఆ అమ్మాయి అతడిని ఎలా భరించింది, ఎలా మార్చింది అనేది సినిమాలో చూపించబోతున్నారు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

Next Story