అయ్యో పాపం.. పండ్లు అమ్ముకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు.. నెటిజన్ల షాకింగ్ రియాక్షన్స్..

by I. Sairam |

ఏఐ(AI) వచ్చాకా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది.

అయ్యో పాపం.. పండ్లు అమ్ముకుంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు.. నెటిజన్ల షాకింగ్ రియాక్షన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఐ(AI) వచ్చాకా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. ప్రపంచంలో అసలు జరగని వింతలను ఈ ఏఐ ద్వారా సృష్టిస్తున్నారు. హీరోలు లావయ్యినట్లు, ఫుడ్‌ను దుస్తులుగా ధరిస్తే ఎలా ఉంటారు.. ? సామాన్యులుగా ఉంటే ఎలా జీవిస్తారు.. ? హీరోలు.. హీరోయిన్లుగా మారితే, హీరోయిన్లు.. హీరోలుగా పుట్టి ఉంటే.. ఇలా ఒకటి అని కాదు.. కొత్త కొత్త ఆలోచనలను చేస్తూ ఈ టెక్నాలజీ ఉపయోగించి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..

వైరల్ అవుతున్న వీడియోలో పూజా హెగ్డే మార్కెట్‌లో కూర్చోని కమలాలు అమ్ముతుంది. అలాగే త్రిష జామకాయలను, సాయి పల్లవి పైనాపిల్‌లను, సమంత అరటి పండ్లను, నయనతార యాపిల్ పండ్లను, శ్రీలీల స్ట్రాబెర్రీస్‌లను, తమన్నా దానిమ్మలను, నిధి అగర్వాల సీతాఫలాలను, రష్మిక డ్రాగెన్ ఫ్రూట్స్‌లను అమ్ముతున్నట్లు ఏఐ ద్వారా క్రియేట్ చేశారు. ఇక వాటిని చూసిన నెటిజన్లు అయ్యో పాపం వాళ్లతో ఎందుకు అలా ఆడుకుంటున్నారని, చాలా బాగుంది వీడియో అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story