అయ్యో పాపం.. ఆస్పత్రి బెడ్‌పై దీన స్థితిలో టాలీవుడ్ హీరోయిన్.. త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్ల కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-14 14:28:23  IST  )

హీరోయిన్ సనా మక్బూల్(sana Makbul) ‘దిక్కులు చూడకు రామయ్య (Dikkulu Chudaku Ramaiah) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

అయ్యో పాపం.. ఆస్పత్రి బెడ్‌పై దీన స్థితిలో టాలీవుడ్ హీరోయిన్.. త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ సనా మక్బూల్(sana Makbul) ‘దిక్కులు చూడకు రామయ్య (Dikkulu Chudaku Ramaiah) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత ‘మామ ఓ చందమామ’(Mama O chandamama) మూవీలో నటించింది. అయితే తన అందంతో మంచి మార్కులే కొట్టేసినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా రాణించలేకపోయింది. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసి అక్కడ వరుస సినిమాల్లో నటించింది. అయితే ప్రజెంట్ ఈ బ్యూటీ తీవ్ర అనారోగ్యం బారిన పడింది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పరిస్థితి ఇప్పుడు మరింత క్షీణించింది. దీంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. ఈ విషయాన్ని డాక్టర్‌ ఆశ్నా కంచ్‌వాలా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

సనా మక్బూల్ ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫొటోను నెట్టింట షేర్ చేసిన ఆమె ‘మై డియర్ స్ట్రాంగ్‌ లేడీ.. ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నావు. నిన్ను చూసి నేను చాలా గర్విస్తున్నాను. నీ ధైర్యం కోల్పోకుండా అలాగే పోరాడు. ఈ కఠినమైన పరిస్థితుల నుంచి నువ్వు త్వరగా బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ నీ వెంటే ఉన్నాను’ అని సదరు నటికి ధైర్యం నూరిపోశారు. ప్రస్తుతం సనా మక్బూల్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సనా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Next Story