'భారతవర్ష' నుంచి 'ఓ ధీరా'.. ఆకట్టుకుంటోన్న గోపీచంద్ లుక్

by Chukka Sudharani |

మాచో హీరో గోపీచంద్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘భరతవర్ష’.

భారతవర్ష నుంచి ఓ ధీరా.. ఆకట్టుకుంటోన్న గోపీచంద్ లుక్
X

దిశ, సినిమా: మాచో హీరో గోపీచంద్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘భరతవర్ష’. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. భారత చరిత్రలోని ఒక అన్వేషించని చారిత్రక ఘట్టం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, గ్లింప్స్‌తో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. 'ఓ ధీరా' అంటూ సాగుతూ మంచు పర్వతాల నడుమ ఒంటరి యోధుడి పోరాటాన్ని అద్భుతమైన విజువల్స్‌తో ఆవిష్కరించిన ఈ పాటకు అనుదీప్ దేవ్ అందించిన సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, దీపక్ బ్లూ గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు సంకల్ప్ విజన్, గోపీచంద్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్ సినిమాటిక్ అనుభూతిగా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంపై 'ఓ ధీరా' పాటతో భారీ హైప్ నెలకొంది.

Next Story