పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. OG సెకండ్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్

by velandi.Saikiran |   (  Updated:2025-08-24 11:49:50  IST  )

వినాయక చవితి అంటే ఈనెల 27వ తేదీన 10:08 AM కు OG సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది.

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. OG సెకండ్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన చేసిన ప్రతి సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల హరిహర వీరమల్లు సినిమాతో మెరిసిన పవన్ కళ్యాణ్... ఇప్పుడు OG సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది.

ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమా సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా పోస్టర్ ద్వారా తెలిపింది. వినాయక చవితి రోజున అంటే ఈనెల 27వ తేదీన 10:08 AM కు సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది.

సువ్వి సువ్వి ( Suvvi Suvvi )అంటూ సాగే ఈ పాట... అందరినీ ఆకట్టుకుంటుందని కూడా పోస్టర్ ద్వారా తెలియజేసింది చిత్రబృందం. ఇక ఓజి సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సింగిల్ అందర్నీ ఆకట్టుకుంది. దీంతో సెకండ్ సింగిల్ పై అంచనాలు పెరిగాయి. పవన్ కళ్యాణ్ అలాగే ప్రియాంక కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది.

Next Story