- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OG: ఓజీ ఫస్ట్ రివ్యూ...ఆ 20 నిమిషాలే బొమ్మ బ్లాక్ బాస్టర్ !
ఉమైర్ సందు పోస్ట్ పెట్టాడు. OG సినిమాతో పవన్ కళ్యాణ్ అలాగే ఇమ్రాన్ హస్మి ఇద్దరు కూడా పవర్ఫుల్ కం బ్యాక్ ఇవ్వడం గ్యారంటీ

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా ఓజీ. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో చాలా గ్రాండ్ గా వస్తున్నట్లు తెలుస్తోంది. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ అలాగే తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్న నిర్వహించారు. సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది.
ఈ మేరకు బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు సంచలన పోస్ట్ పెట్టాడు. OG సినిమాతో... పవన్ కళ్యాణ్ అలాగే ఇమ్రాన్ హస్మి ఇద్దరు కూడా పవర్ఫుల్ కం బ్యాక్ ఇవ్వడం గ్యారంటీ అని పేర్కొన్నాడు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అదిరిపోయాయని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కు సాలిడ్ కం బ్యాక్ ఈ సినిమా ఇవ్వబోతుందని స్పష్టం చేస్తూ పోస్ట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు క్లైమ్యాక్స్ బలమన్నారు. క్లైమాక్స్ లో 20 నిమిషాల సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయన్నారు. థియేటర్లు కూడా బ్లాస్ట్ కావడం గ్యారెంటీ అంటూ పోస్టు పెట్టారు బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్. క్లిక్






