చంద్రగ్రహణం సరే.. ‘OG’ గ్రహణం చూశారా?

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-08 14:50:58  IST  )

ప్రపంచ వ్యాప్తంగా చంద్రగ్రహణం(Lunar Eclipse) ముగిసింది.

చంద్రగ్రహణం సరే.. ‘OG’ గ్రహణం చూశారా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా చంద్రగ్రహణం(Lunar Eclipse) ముగిసింది. సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం రాత్రి 9:56 గంటల నుంచి రాత్రి 1:26 గంటల వరకూ ఈ గ్రహణం ఏర్పడింది. గ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారాడు. దాదాపు చంద్రుడు 82 నిమిషాలపాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. అర్ధరాత్రి 2.25 గంటలు దాటాక పూర్తి గ్రహణం వీడింది. చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను అర్చకులు మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం ఆలయాలు తెరుచుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఆదివారం ఆకాశంలో చంద్రగ్రహణం ఏర్పడితే.. సోషల్ మీడియాను ఓజీ గ్రహణం(OG Eclipses) పట్టింది. చంద్ర గ్రహణం సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ఫ్యాన్స్ అంతా గ్రహణ సమయంలో ఎరుపుగా మారిన చంద్రుడితో ఓజీ టైటిల్ కార్డ్స్ షేర్ చేసి నెట్టింట రచ్చ చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. వేల సంఖ్యలో ఓజీ ట్వీట్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Read Also..

పవన్ కళ్యాణ్‌తో పోటీ పడటం కంటే మంచి మార్గం ఏముంటుంది: ఇమ్రాన్ హష్మీ

Next Story