- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఓజీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే ?
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఇండియాలో మొత్తం 90.25 కోట్లు వసూలు చేసినట్లు చెబుతున్నారు

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా ఓజి. ఈ సినిమా మొన్న రాత్రి రిలీజ్ అయి.. సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో జనాలు సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. పండగ సీజన్ కావడంతో.. చాలా మంది సినిమాకి వెళ్తున్నారు.
అయితే ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ వసూలుపై ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ ఓజి సినిమా మొదటి రోజు... భారీ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ అనలిస్ట్ sacnilk వెల్లడించింది. ప్రీమియర్స్ షోలో తో కలిపి ఈ సినిమా ఇండియాలో మొత్తం 90.25 కోట్లు వసూలు చేసినట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా తెలుగులో 69.35% ఆక్యుఫెన్సీ వచ్చిందట. తమిళ ఇండస్ట్రీలో 18.36 శాతం, హిందీలో 10.37% అక్యుపెన్సి వచ్చినట్లు ట్రేడ్ అనలిస్ట్ స్పష్టం చేసింది. ఆల్ టైం ఇండియా ప్రీమియర్స్ గ్రాసర్ గా కూడా ఈ సినిమా రికార్డు లోకి ఎక్కింది. వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో వచ్చే వారం రోజుల పాటు...కలెక్షన్స్ భారీగానే వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు టాలీవుడ్ పెద్దలు.






