బిగ్‌బాస్ హౌజ్ సీజ్.. అర్ధాంతరంగా ఆగిపోయిన షో

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-07 14:54:48  IST  )

అర్ధాంతరంగా ఆగిపోయిన బిగ్‌బాస్ షో

బిగ్‌బాస్ హౌజ్ సీజ్.. అర్ధాంతరంగా ఆగిపోయిన షో
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బిగ్‌బాస్ షో(Kannada Bigg Boss Show) నిర్వహకులకు అనూహ్య షాక్ తగిలింది. బిగ్‌బాస్ హౌజ్‌ను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సీజ్ చేశారు. మురుగునీరు శుద్ధి చేయకుండా నాలాల్లోకి వదులుతున్నారని ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(Pollution Control Board) అధికారులకు కంప్లైంట్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పక్కా ఆధారాలతో హౌజ్‌ను సీజ్ చేశారు. కంటెస్టెంట్‌లను బయటకు పంపంచి.. హౌజ్‌కు తాళం వేశారు. అయితే.. అనూహ్యంగా అధికారుల కళ్లుగప్పి కంటెస్టెంట్లు మళ్లీ వెనుక డోర్ నుంచి హౌజ్‌లోకి వెళ్లారు. ఒకసారి చెబితే అర్థం కాదా? అని కంటెస్టెంట్‌లపై అధికారులు సీరియస్ అయ్యారు. దీంతో చేసేదేంలేక అందరూ బయటకు వచ్చేశారు. మూడు ప్రధాన కారణాలు చూపిస్తూ షో ఆపేయాలని నోటీసులు ఇచ్చారు. అయితే.. షో ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడంతో అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు.

Next Story