Bigg Boss 9 : కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేటెడ్...రెమ్యూనరేషన్ ఎంతంటే !

by velandi.Saikiran |   (  Updated:2025-09-14 17:10:28  IST  )

కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేటెడ్ అయ్యారు. జానీ మాస్ట‌ర్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి... తెర‌పైకి వ‌చ్చిన కొరియోగ్ర

Bigg Boss 9 : కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేటెడ్...రెమ్యూనరేషన్ ఎంతంటే !
X

దిశ‌, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ 9 షో చాలా ర‌స‌వ‌త్తంగా జ‌రుగుతోంది. మొన్న సెప్టెంబ‌ర్ 7వ తేదీన చాలా గ్రాండ్ గా ప్రారంభం అయింది. అయితే... చూస్తుండ‌గానే.. ఈ షోలో ఎలిమినేష‌న్ సెష‌న్‌ ప్రారంభం అయింది. అయితే.. తొలి ఎలిమినేష‌న్ లో ఒక్క‌రిని మాత్ర‌మే బిగ్ బాస్ హౌజ్ నుంచి బ‌య‌ట‌కు పంపిచారు. అదృష్టం క‌లిసి రాక‌పోవ‌డంతో... కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేటెడ్ అయ్యారు.

జానీ మాస్ట‌ర్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి... తెర‌పైకి వ‌చ్చిన కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. అనుహ్యంగా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే.. ఆమె హౌజ్ లో నిల‌దొక్కుకోలేక‌పోయారు. ఓటింగ్‌, ఫ‌ర్మామెన్స్ రెండింటిలోనూ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ మెరుగు ప‌డ‌లేదు. దీంతో ఎలిమినేట్ అయ్యారు. మొద‌టి వారంలోనే పెద్దగా... కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ( sharasti Verma ) ఆకట్టుకోలేదట. దీంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు. అయితే దాదాపు వారం రోజులపాటు బిగ్ బాస్ హౌజ్ లోనే ఉన్న కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ 2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. ఎలిమినేట్ కావ‌డంతో సేఫ్ జోన్ లోకి కంటెస్టెంట్ ఆశ వెళ్లారు.

Next Story