‘హరిహర వీరమల్లు’ ప్రీరిలీజ్ ఫంక్షన్‌పై అధికారిక ప్రకటన.. వేదిక మార్పు

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-17 13:34:42  IST  )

ప్రీరిలీజ్ ఫంక్షన్‌పై హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది.

‘హరిహర వీరమల్లు’ ప్రీరిలీజ్ ఫంక్షన్‌పై అధికారిక ప్రకటన.. వేదిక మార్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రీరిలీజ్ ఫంక్షన్‌పై హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. జులై 21వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా సాయంత్రం 6 గంటలకు ప్రీరిలీజ్ ఫంక్షన్ ఉండబోతోందని పేర్కొంది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలుమార్లు ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. మొత్తానికి జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని క్రిష్‌ కొంతభాగం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రొడ్యూసర్‌ రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. పవన్‌ ఇందులో చారిత్రక యోధుడిగా మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. నిధి అగర్వాల్‌(Nidhi Agarwal) హీరోయిన్‌. బాబి డియోల్, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తొలి భాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల కానుంది.

Next Story