ఆయుధ పూజతో స్టార్ట్ అయిన విష్ణు కొత్త సినిమా.. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

by Chukka Sudharani |

యంగ్ హీరో శ్రీవిష్ణు రీసెంట్‌గా ‘సింగిల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు.

ఆయుధ పూజతో స్టార్ట్ అయిన విష్ణు కొత్త సినిమా.. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: యంగ్ హీరో శ్రీవిష్ణు రీసెంట్‌గా ‘సింగిల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రజెంట్ ఈ హీరో రెండు, మూడు చిత్రాలు లైన్లో పెట్టినట్లు తెలుస్తుండగా.. వీటికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. అలాగే ఈ సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం నెటిజన్లు కూడా వెయిట్ చేస్తుండగా.. తాజాగా ఓ సినిమాపై అయితే అప్డేట్ వచ్చింది. శ్రీవిష్ణు కెరీర్‌లో 19వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. ఈ రోజు ఆయుధ పూజ సందర్భంగా.. ఓ పెద్ద గన్ పోస్టర్‌ను షేర్ చేశారు. దీనికి ‘ది రెబెల్ విత్ ఎ హార్ట్ గురించి తెలుసుకుందాం.. శ్రీవిష్ణు తదుపరి చిత్రం టైటిల్ & ఫస్ట్ లుక్ రేపు మధ్యాహ్నం 12:06 గంటలకు రాబోతున్నది.. చూస్తూనే ఉండండి.. ఆయుధ పూజ శుభాకాంక్షలు’ అంటూ తెలియజేశారు. లింక్


Next Story