Official: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విడుదల తేదీ ప్రకటన (ట్వీట్)

by Chukka Sudharani |

AP డిప్యూటీ సీఎం (Deputy CM), పవర్ స్టార్ పవన్ కల్యాన్ (Power Star Pawan Kalyan) మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’

Official: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విడుదల తేదీ ప్రకటన (ట్వీట్)
X

దిశ, సినిమా: AP డిప్యూటీ సీఎం (Deputy CM), పవర్ స్టార్ పవన్ కల్యాన్ (Power Star Pawan Kalyan) మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ (Most Prestigious Project) ‘హరిహర వీరమల్లు’ (HariHara VeeraMallu). పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వం వహిస్తున్నాడు. ఏఎమ్ రత్నం (AM Ratnam) నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ (Bobby Deol) విలన్‌గా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే.. ‘హరిహర వీరమల్లు’ సినిమా అనౌన్స్ చేసి దాదాపు 5ఏళ్లు పూర్తి కావస్తుండగా.. రిలీజ్‌కు మాత్రం నోచుకోలేదు. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

ఇక అభిమానుల ఆశలు, ఎదురు చూపులు ఫలించాయి. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు సిద్ధం కావడంతో పాటు పవన్ కల్యాణ్ కూడా షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ.. ‘పవర్ అప్‌డేట్ అలర్ట్!! ధర్మ కోసం ఎపిక్ బ్యాటిల్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ యుద్ధం దారుణంగా, గొప్పగా అండ్ చిరస్మరణీయంగా ఉంటుందని మేము మీకు హామీ ఇస్తున్నాము. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వారం చివరిలో HariHaraVeeraMallu షూట్‌లో జాయిన్ అవుతారు! వీర మల్లు మిమ్మల్ని 28 మార్చి, 2025న థియేటర్లలో కలుస్తారు!’ అంటూ పోస్ట్ పెట్టారు చిత్ర బృందం.

Next Story