- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓదెల-2’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు.. ఎన్ని భాషల్లో రానుందంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓదెల-2’(Odela-2).

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓదెల-2’(Odela-2). అశోక్ తేజ(Ashok Teja) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మధు క్రియేషన్స్ బ్యానర్‌పై సంపత్ నంది నిర్మించారు. అయితే ఈ చిత్రం ఘన విజయం సాధించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ కు సీక్వెల్‌గా వచ్చింది. ఇక ఇందులో హెబ్బా పటేల్(Hebba Patel), వశిష్ట వన్ సింహా, యువ, నాగ మహేష్(Naga Mahesh), వంశీ గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్ పూజా రెడ్డి(Bhupal Pooja Reddy) వంటి వారు కీలక పాత్రలో నటించారు. ప్రేతాత్మకు, నాగసాధువుకు మధ్య పోరాటం నేపథ్యంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 17న థియేటర్స్‌లో విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ‘ఓదెల-2’ మొదటి పార్ట్ కంటే మరింత సస్పెన్స్‌లతో వచ్చి బాక్సాఫీసు వద్ద రాణించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘ఓదెల-2’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వంటి భాషల్లో మే 8 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ సినిమా నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతుండటం విశేషం. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సినీ ప్రియులు సంతోష పడుతున్నారు. అయితే ‘ఓదెల-2’కేవలం ప్రైమ్ వీడియోలో మాత్రమే స్ట్రీమింగ్ కాబోతున్నట్లు కూడా చిత్ర బృందం తెలిపింది.






