- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఓ టార్చర్ ప్రేమ’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. పోస్ట్ వైరల్
సినీ ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం సహజమే. అలా చాలామంది వారసులు వచ్చి తమ సత్తా చాటారు.

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం సహజమే. అలా చాలామంది వారసులు వచ్చి తమ సత్తా చాటారు. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మరో వారసుడు ఘనంగా అరంగేట్రం చేస్తున్నాడు. 'ఎర్రన్న'గా పేరుగాంచిన మాదాల రంగారావు మనవడు, మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల(Sunny Madala) "ఓ టార్చర్ ప్రేమ"(O Torture Prema) సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఇందులో మౌనిక డాకోజు(Mounika Dakoju) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీను రంగస్వామి(Sreenu Rangaswamy), రోహిణి(Rohini), యాదమ్మ రాజు(Yadamma Raju), విష్ణు ప్రియ(Vishnu Priya)లు కీలక పాత్రలో నటిస్తున్నారు.
దీనిని శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకర్ కృష్ణ(Srikar Krishna) స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను తాజాగా ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేశారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘రచయిత & దర్శకుడు డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారు ఓ టార్చర్ ప్రేమ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.. నవతరం ప్రేమకథను పెద్ద తెరపై అనుభవించడానికి సిద్ధంగా ఉండండి’ అని రాసుకొస్తూ ఫొటోలు రిలీజ్ చేశారు. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.






