- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఓ..! సుకుమారి' ఎదురుచూపులు ముగిశాయి.. మీ ముందుకు వచ్చేస్తుంది
తిరు వీర్, ఐశ్వర్య రాజేష్‌లు కలయికలో వస్తోన్న ఉల్లాసభరితమైన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘ఓ..! సుకుమారి’.

దిశ, సినిమా: తిరు వీర్, ఐశ్వర్య రాజేష్‌లు కలయికలో వస్తోన్న ఉల్లాసభరితమైన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘ఓ..! సుకుమారి’. ఈ చిత్రానికి భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తుండగా.. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఇదే జోష్‌తో సినిమా విడుదల తేదీని ప్రకటించింది టీమ్. ‘'ఓ..! సుకుమారి' కోసం ఎదురుచూపులు ముగిశాయి. జులై 17న థియేటర్లలో విడుదల కాబోతుంది’ అంటూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. తుఫాను మేఘాలు, పచ్చని ప్రకృతితో నిండిన విశాలమైన నేపథ్యంలో రూపొందించిన విడుదల తేదీ పోస్టర్, ఫాంటసీని రొమాన్స్‌తో అందంగా మేళవించింది. సాంప్రదాయ దుస్తులలో హుందాగా కూర్చున్న ఐశ్వర్య రాజేష్, తిరువీర్ వైపు తన చేతిని చాస్తుండగా.. ఆకర్షణీయమైన చిరునవ్వుతో చూస్తున్న తిరువీర్ లుక్ టోటల్‌గా ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.






