- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓ..! సుకుమారి
by Sujitha Rachapalli |
తిరువీర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించబోతున్న సినిమా ‘ఓ..! సుకుమారి’. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా భరత్ దర్శన్ డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. కాగా తాజాగా ఆకట్టుకునే

X
దిశ, సినిమా : తిరువీర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించబోతున్న సినిమా ‘ఓ..! సుకుమారి’. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా భరత్ దర్శన్ డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. కాగా తాజాగా ఆకట్టుకునే పోస్టర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. నీలిరంగు హృదయ చిహ్నాన్ని ఒక అద్భుతమైన నారింజ రంగు మెరుపుతో డివైడ్ చేశారు. గ్రామ ప్రజలు పరిగెడుతూ కనిపంచడం కథలోని ఊహించని మలుపులను సూచిస్తుంది. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ‘రజాకార్’, ‘పొలిమేర’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సిహెచ్ కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామెన కాగా ఎంఎం కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తున్నారు. పాపులర్ లిరిక్ రైటర్ పూర్ణచారి ఈ చిత్రంలోని అన్ని పాటలకు సాహిత్యం అందించబోతున్నారు.
Next Story






