‘ఓ రోమియో’ ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్.. ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యేది అప్పుడే..

by Gugulothu.Kavitha |

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, స్టార్ బ్యూటీ తృప్తి దిమ్రి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ రోమియో’.

‘ఓ రోమియో’ ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్.. ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యేది అప్పుడే..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, స్టార్ బ్యూటీ తృప్తి దిమ్రి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ రోమియో’. ఇక దీనికి టాలెంటెడ్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం.

ఇక గ్లింప్స్‌‌ను గమనించినట్లయితే.. ఈ సినిమాలో షాహిద్ కపూర్ మునుపెన్నడూ లేని విధంగా ఒక ‘వైల్డ్’ లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒళ్లంతా టాటూలు, రక్తపు మరకలు, అందరినీ కాల్చి చంపడం అన్నీ వైల్డ్‌గా అనిపించింది. అలాగే ఇందులో తృప్తి దిమ్రితో పాటు నానా పటేకర్, అవినాష్ తివారీ, విక్రాంత్ మస్సే, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా ఒక ప్రత్యేక పాత్రలో అలరించనుందని గ్లింప్స్‌లో వెల్లడించారు. ఫైనల్‌గా గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

Next Story