ఓ అందాల రాక్షసి.. వచ్చే ఏడాదిలో బెస్ట్ మూవీ ఇదే..

by Sujitha Rachapalli |

దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విహాన్షి హెగ్డే, కృతి

ఓ అందాల రాక్షసి.. వచ్చే ఏడాదిలో బెస్ట్ మూవీ ఇదే..
X

దిశ, సినిమా : దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విహాన్షి హెగ్డే, కృతి వర్మ హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మించిన ఈ చిత్రం.. జనవరి 2న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన షెరాజ్ మెహదీ..‘‘ఓ అందాల రాక్షసి’ మూవీని జనవరి 2న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. ఏడాదికి ఓ మంచి సినిమా వస్తుంది. అలాంటి ఓ మంచి సినిమానే మా ‘ఓ అందాల రాక్షసి’. ఇందులో కృతి వర్మ, విహాన్షి హెగ్డే, నేహా దేశ్ పాండే, అఖిల, గీతా రెడ్డి, స్నేహా, ప్రియా దేశ్ పాల్, సుమన్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్.. ఇలా చాలా మంది అద్భుతమైన పాత్రల్ని పోషించారు. అద్భుతమైన కంటెంట్‌తో రాబోతున్న చిత్రం చూస్తుంటే... ఆడియన్స్‌కి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. మంచి సందేశాత్మక కథతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఇందులోని ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి. అమ్మాయిలకు నచ్చే చిత్రం అవుతుంది’ అని తెలిపారు.


Next Story