వెంకీ మామ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ మూవీ ట్రైలర్ ఔట్

by velandi.Saikiran |

విక్టరీ వెంకటేష్ ఫాన్స్ కు అదిరిపోయే శుభవార్త అందింది. విక్టరీ వెంకటేష్ నటించిన మూవీ ట్రైలర్ వచ్చేసింది. అయి

వెంకీ మామ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ మూవీ ట్రైలర్ ఔట్
X

దిశ‌, వెబ్ డెస్క్: విక్టరీ వెంకటేష్ ఫాన్స్ కు అదిరిపోయే శుభవార్త అందింది. విక్టరీ వెంకటేష్ నటించిన మూవీ ట్రైలర్ వచ్చేసింది. అయితే ఈ సినిమా కొత్తది కాదు. పాతదే. విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమా అప్పట్లో రిలీజ్ అయి బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమా ఇప్పుడు మళ్లీ రీ-రిలీజ్ కానుంది. జనవరి ఒకటో తేదీ అంటే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

ఈ ట్రైలర్ చూసిన విక్టరీ వెంకటేష్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఆర్తి అగర్వాల్, వెంకటేష్ మధ్య రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి సినిమా వెంకీ మామ తీస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సంక్రాంతికి స్పెషల్ రోల్ లో విక్టరీ వెంకటేష్ వస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబోలో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా రానుంది. ఇందులో అతిధి పాత్రలో వెంకీ మామ కనిపించనున్నారు. ఈ మూవీ ఇప్పుడు వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.


Next Story