NTR: యంగ్ యమ మళ్ళీ వస్తున్నాడు.. పవర్ ఫుల్ ట్రైరల్ రిలీజ్ చేసిన మేకర్స్!

by Chukka Sudharani |   (  Updated:2025-07-25 06:26:54  IST  )

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ (re-released) ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

NTR: యంగ్ యమ మళ్ళీ వస్తున్నాడు.. పవర్ ఫుల్ ట్రైరల్ రిలీజ్ చేసిన మేకర్స్!
X

దిశ, సినిమా: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ (re-released) ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బర్త్‌డే సందర్భంగా.. లేదా పండుగల సందర్భంగా స్టార్ హీరోలు నటించిన చిత్రాలు రీరిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నారు చిత్ర బృందాలు. ఈ క్రమంలోనే ఇప్పటికే వచ్చిన పలు చిత్రాలు రిలీజ్ సమయంలో హిట్ అందుకోకపోయిన రీ రిలీజ్‌లో మాత్రం భారీ వసూళ్లు రాబట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్.. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతాయా అంటూ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్‌కు బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ వచ్చింది.

ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ.. రీ రిలీజ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ రీ రిలీజ్ ట్రైలర్‌కు నెట్టింట విశేష స్పందన లభిస్తుంది. కాగా.. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించగా.. ప్రియమణి (Priyamani) హీరోయిన్‌గా మెప్పించింది. మోహన్ బాబు (Mohan Babu), ఆలీ, మమతా మోహన్ దాస్, నవనీత్ కౌర్, మాస్టర్ శ్రీ సింహా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 2007లో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు మే 18 న మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది.

Next Story