- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NTR: ఆయనొక అద్భుతమైన వ్యక్తి.. వార్-2పై ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం ‘వార్-2’లో నటిస్తున్నాడు.

దిశ, సినిమా: ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం ‘వార్-2’లో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ YRF నిర్మాణంలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రతీ అప్డేట్ ఆకట్టుకోగా.. ఇటీవల వచ్చిన టీజర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. దీంతో వార్-2పై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ పూర్తయింది అంటూ స్పెషల్ ట్వీట్ చేశాడు. ‘వార్ 2 షూటింగ్ పూర్తయింది. దీని నుంచి చాలా తీసుకున్నాను. హృతిక్ సర్‌తో సెట్‌లో ఉండటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. వార్ 2 జర్నీలో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. డైరెక్టర్ అయాన్ ఒక అద్భుతం. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఒక పెద్ద సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌ని తయారుచేస్తున్నారు. YRF సంస్థకు, సిబ్బందికి ధన్యవాదాలు. ఆగస్టు 14 న మీరు ఈ సినిమాని చూసేదాకా వేచిఉండలేను’ అని తెలిపారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవ్వగా ఫ్యాన్స్ వార్ 2పై ఫ్యాన్స్‌లో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. లింక్






