- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రాగన్ గ్లింప్స్‌కు వస్తున్న రెస్పాన్స్‌పై ఎన్టీఆర్ షాకింగ్ రియాక్షన్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్‌గా ‘డ్రాగన్’ చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్‌గా ‘డ్రాగన్’ చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ క్షణాల్లోనే వైరల్‌గా మారి టాప్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఓ స్పెషల్ నోట్ షేర్ చేశాడు. ‘ఇన్నేళ్లుగా, మీ శుభాకాంక్షలు, సపోర్ట్ నా ప్రయాణంలో నాకు లభించిన గొప్ప ఆశీర్వాదాలలో ఒకటిగా నిలిచాయి. ప్రతి దశలోనూ ఇంత ప్రేమతో నాకు అండగా నిలిచిన నా ప్రియమైన అభిమానులందరికీ ధన్యవాదాలు. డ్రాగన్‌గ్లింప్స్‌కు వచ్చిన స్పందనను చూడటం మా ముఖాలపై పెద్ద చిరునవ్వును తీసుకురావడమే కాకుండా, మీ అందరికీ ఒక మరపురాని అనుభూతిని అందించడానికి మాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని నింపింది. ఈ ఘనత అంతా ఒక్క వ్యక్తికే దక్కుతుంది, డ్రాగన్‌ను కలగన్న నా ప్రశాంత్ నీల్‌కే. నా శ్రేయోభిలాషులు, సహోద్యోగులు, స్నేహితులు, మీడియా అండ్ ప్రతిఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తెలిపాడు.






