NTR: ఆ సినిమాపై ఎన్టీఆర్ పోస్ట్.. గుండె వణుకుతున్నట్లుగా ఉందంటూ స్టార్ కమెడియన్ రిప్లై

by Mallepaka Hamsa |

స్టార్ కమెడియన్ బ్రహ్మానందం(Brahmanandam) ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

NTR: ఆ సినిమాపై ఎన్టీఆర్ పోస్ట్.. గుండె వణుకుతున్నట్లుగా ఉందంటూ స్టార్ కమెడియన్ రిప్లై
X

దిశ, సినిమా: స్టార్ కమెడియన్ బ్రహ్మానందం(Brahmanandam) ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన స్టార్ హీరోలందరి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి పలు అవార్డులు కూడా పొందారు. ఇటీవల ఆయన కల్కి, డార్లింగ్, గేమ్ చేంజర్(Game Changer) వంటి సినిమాలతో అలరించారు. అయితే బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రహ్మా ఆనందం’. స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్స్(Swadharma Entertainments) బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియా వడ్లమాని(Priya Vadlamani), ఐశ్వర్య హెలక్కల్, గౌతమ్, కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి ఆర్‌విఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు.

అయితే ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. ఫిబ్రవరి 14న లవర్స్ డే కానుకగా థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇందులో బ్రహ్మానందం నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే సినీ ప్రియులు కూడా ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘బ్రహ్మా ఆనందం’ సినిమాపై ఎన్టీఆర్ ఇన్‌స్టా ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ సినిమా గురించి పాజిటివ్ విషయాలు వింటున్నాను. రాజా గౌతమ్(Raja Gautam), బ్రహ్మానందం, అలాగే మూవీ టీమ్ అందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నాను’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ చూసిన బ్రహ్మానందం .. ‘‘ఈ ఫీలింగ్ ఏంట్రా గుండె ఏదో వణుకుతున్నట్లు ఉందిరా’’ అని అదుర్స్ డైలాగ్‌ను రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నారు.

Next Story