- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సంస్థతో మాకు సంబంధం లేదు.. ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన!
ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. 'RAW NTR' సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేయడానికి గానీ, కార్యక్రమాలు నిర్వహించడానికి గానీ 'RAW NTR'కు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. 'RAW NTR' సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేయడానికి గానీ, కార్యక్రమాలు నిర్వహించడానికి గానీ 'RAW NTR'కు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ కి సంబంధించిన సేవా, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం ఆయన లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడి అవుతాయని తెలిపింది. ఈ అంశంపై ఇదే తమ నుండి తుది వివరణ అని స్పష్టం చేసింది.
మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వర్గాలు, అభిమానులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయవద్దని, కేవలం అధికారిక వర్గాల ద్వారా వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని కోరింది. ఇదిలా ఉంటే ఈ నెల 18న ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఉంటుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ప్రచారం ఉత్తిదే అని చెప్పేందుకు ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది.






