ఎన్టీఆర్ తాగే వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..ఈ వాటర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే?

by Ajay Maddhiboyina |

సెలబ్రెటీలకు సంబంధించిన ఏ విషయం అయినా అభిమానులకు, ప్రజలకు చాలా ఇంట్రెస్ట్. వాళ్ల గురించి తెలుసుకునేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు.

ఎన్టీఆర్ తాగే వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..ఈ వాటర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: సెలబ్రెటీలకు సంబంధించిన ఏ విషయం అయినా అభిమానులకు, ప్రజలకు చాలా ఇంట్రెస్ట్. వాళ్ల గురించి తెలుసుకునేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. వాళ్లు వేసుకునే దుస్తుల నుండి వాళ్లు తినే ఆహారం వరకు ప్రతిఒక్కటీ చాలా ఆసక్తితో తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలోనే జూనియన్ ఎన్టీఆర్ ఓ సినిమా ఫంక్షన్ లో సాధారణ వాటర్ కాకుండా ఒక కొత్త బ్రాండ్ వాటర్ తాగడంతో దాని గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఇంటర్నెట్ లో తెగ వెతుకుతున్నారు. ఆ నీళ్ల బాటిల్ పేరు పెర్రియర్ కాగా ఇది ఓ ప్రసిద్ధ ఫ్రెంచ్ బ్రాండ్‌కు చెందినది. ఈ నీళ్ల వల్ల అనేక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని స్పార్క్లింగ్ మిన‌ర‌ల్ వాట‌ర్ అంటారు. ఈ నీళ్లు హైడ్రేట్ గా ఉంచ‌డంలో ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ నీటిలోని కార్బోనేష‌న్ రుచిని ఎంతో మెరుగుప‌రుస్తుంది.

కాబ‌ట్టి సాధార‌ణ నీటి కంటే వీటిని ఎక్కువ‌గా తాగేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఈ నీటిలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం లాంటి ఖ‌నిజ ల‌వ‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఎముక‌ల ఆరోగ్యానికి, కండ‌రాల ప‌నితీరు మ‌రియు ఎల‌క్ట్రోలైట్ స‌మ‌తుల్య‌త‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర్చేందుకు స‌హాయ‌ప‌డతాయి. గ్యాస్, ఉబ్బ‌రం లాంటి స‌మ‌స్య‌ల‌ను సైతం తగ్గించే గుణం ఈ నీటికి ఉంటుంది. ఇందులో చెక్కెర‌లు, ఎలాంటి కృత్రిమ షుగ‌ర్స్ ఉండ‌వు కాబ‌ట్టి కూల్ డ్రింక్స్, సోడాల‌కు బ‌దులుగా వీటిని తీసుకోవ‌చ్చు. ఈ నీటిలో కాల‌రీలు త‌గ్గువ‌గా ఉండ‌టం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌టం, నియంత్ర‌ణ‌లో ఉండ‌టంలో స‌హాయ‌ప‌డతాయి. వ్యాయామం చేసిన త‌ర‌వాత శ‌రీరంలో ఎల‌క్ట్రోలైట్స్ త‌గ్గుతాయి, కాబ‌ట్టి వాటిని నియంత్రించ‌డానికి ఈ నీళ్లు తాగ‌వ‌చ్చు. ఇక ఇన్ని లాభాలు ఉన్న ఈ నీటి ధ‌ర కూడా ఎక్కువే. 750 మిల్లీ లీట‌ర్ల వాట‌ర్ బాటిల్ ధ‌ర రూ.325గా ఉంది. అదే సాధార‌ణ వాట‌ర్ బాటిల్ అయితే లీట‌ర్ నీళ్ల‌కు కేవ‌లం రూ.20 రూపాయ‌లు ఉంటుంది.

Next Story