- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ రీ-రిలీజ్.. ఆనందంలో నందమూరి ఫ్యాన్స్
ప్రజెంట్ తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ప్రజెంట్ తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల బర్త్‌డేలా సందర్భంగా గతంలో వచ్చిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఈ కోవలో ఇప్పటికే చాలా సినిమాలు రీరిలీజై మంచి సక్సెస్‌ను అందుకోగా.. తాజాగా ఎన్టీఆర్ (NTR) చిత్రం రీరిలీజ్‌కు సిద్ధం అయింది. ఎన్టీఆర్ హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘యమదొంగ’ (Yamadonga). మంచు మోహన్ బాబు (Manchu Mohanbabu), ఆలీ (Ali), మమతా మోహన్ దాస్(Mamatha Mohan das), ప్రియమణి (Priyamani) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 2007 వచ్చి మంచి హిట్ అందుకుంది.
ఇప్పుడు ఈ చిత్రం మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుందని మైత్రీ మూవీ డిస్టిబ్యూటర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘యమదొంగ’8k రాబోతుంది. ఈ సోషియో ఫాంటసీ చిత్రం 8K లో పునరుద్ధరించబడింది. అలాగే మే 18 న ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా విడుదల అవుతుండగా.. 19, 20న కూడా థియేటర్‌లలో సందడి చేయనుంది’ అంటూ తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






