NTRNeel: డ్రాగన్ తేదీ ఫిక్స్ వెనక స్ట్రాంగ్ స్ట్రాటజీ

by Pulgam srinivas |

మొదటి పది రోజుల్లో ఆరు రోజులు… ఎన్టీఆర్–నీల్ మూవీకి బిగ్ అడ్వాంటేజ్

NTRNeel: డ్రాగన్ తేదీ ఫిక్స్ వెనక స్ట్రాంగ్ స్ట్రాటజీ
X

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ చిత్రానికి అధికారికంగా టైటిల్‌ను ప్రకటించలేదు. అయితే ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాను 2027 జూన్ 11వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ప్రారంభమై చాలా కాలం గడిచింది.

ఇక విడుదల తేదీ కూడా చాలా ఆలస్యంగా ఉండడంతో, ఇంత దూరంగా రిలీజ్ డేట్ ఎందుకు పెట్టారనే సందేహం కొంతమందిలో వ్యక్తమవుతోంది. అయితే ఒక అద్భుతమైన ప్లానింగ్‌తోనే ఈ మూవీ బృందం ఈ విడుదల తేదీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అది ఎలా అనుకుంటున్నారా? ఈ మూవీ 2027 జూన్ 11, శుక్రవారం రోజున విడుదల కానుంది. సినిమా విడుదల రోజు కావడంతో సహజంగానే ఆ రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అదే రోజు మంచి టాక్ వచ్చినట్లయితే, వెంటనే వచ్చే రెండు రోజులు వీకెండ్ కావడం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.

అలాగే 5వ రోజు మొహర్రం పండుగ హాలిడే కూడా ఈ చిత్రానికి కలిసి రానుంది. దాంతో పాటు తర్వాత వచ్చే మరో వీకెండ్ కూడా ఈ సినిమాకు అదనపు ప్రయోజనంగా మారనుంది. ఇలా సినిమా విడుదలైన తర్వాత మొదటి పది రోజుల్లో దాదాపు ఆరు రోజులపాటు మంచి హాలిడేస్ ఈ చిత్రానికి దొరకనున్నాయి. అందుకే మూవీ యూనిట్ కాస్త దూరంగా ఉన్న ఈ తేదీని ఎంచుకున్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story