- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామోజీ ఫిల్మ్ సిటీలో NTRNeel షూటింగ్.. పూనకాలు తెప్పించే సాంగ్‌లో ఎన్టీఆర్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ‘NTRNeel’.

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ‘NTRNeel’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఇందులో రుక్మిణి వసంత్, శ్రద్ధా కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కాగా.. ఇటీవల సెట్స్‌లోకి రుక్కిణి వసంత్ కూడా ఎంట్రీ ఇచ్చినట్లు చిత్ర బృందం అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ పార్ట్‌కు సంబంధించిన సీన్స్ చిత్రీకరిస్తున్నారట మేకర్స్.
ఈ మేరకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సెట్ వేశారట. ఇందులో ఎన్టీఆర్‌పై ఒక పాట షూట్ చేస్తున్నారని ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ఇంకొక విశేషం ఏంటంటే.. ఆ పాట అంతా ఒక ఎత్తు అయితే పాటలోని వందేమాతరం బీజీయం మరో ఎత్తని టాక్. అంతే కాకుండా.. ఈ పాటకు థియేటర్‌లో పూనకాలు ఖాయమని ఇన్‌సైడ్ వర్గాల టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏదైనా అప్డేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా మెసేజులు పెడుతున్నారు.






