- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTR-Neel : ఎన్టీఆర్ సినిమాపై మరో అప్డేట్..ఇక అర్ధరాత్రి తుఫానే
ఇవాళ అర్ధరాత్రి డ్రాగన్ టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నందమూరి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్...RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆయన అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా... ఇవాళ అర్ధరాత్రి టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో ఇవాళ అర్ధరాత్రి 11 గంటల 52 నిమిషాలకు గ్లింప్స్ వదులుతున్నట్లు పేర్కొంది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ గ్లింప్స్ వదలనున్నారు. ఇక ఈ టీజర్ గ్లింప్స్ ఐదు భాషల్లో విడుదల కావడమే కాకుండా మొత్తం నాలుగు నిమిషాల 35 సెకండ్ల పాటు రన్ టైం కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫాన్స్ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. కాగా ఈ సినిమా జూన్ 11వ తేదీన వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.






