Operation Sindoor: ఈ సమయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్.. వైరల్‌గా మారిన వీడియో

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-10 08:35:38  IST  )

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏకంగా 26 మంది అమాయకపు ప్రజలు మరణించిన విషయం తెలిసిందే.

Operation Sindoor: ఈ సమయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్.. వైరల్‌గా మారిన వీడియో
X

దిశ, సినిమా: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏకంగా 26 మంది అమాయకపు ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో యావత్ భారతీయులు ఆగ్రహానికి గురయ్యారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ ఉగ్రమూకలపై విరుచుకుపడింది. పాకిస్తాన్‌తో పాటు తొమ్మిది కీలక స్థావరాలను నేలమట్టం చేసి పాక్‌ను తుక్కు తుక్కుగా ఓడించి అక్కడి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం అయ్యేలా చేసింది. దీంతో పాకిస్తాన్ భారత్ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు మిస్సైళ్లతో దాడులకు పాల్పడుతోంది. అయినప్పటికీ భారత్ సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రంగా మారుతోంది.

దీంతో భారతీయులు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాక అయోమయంలో పడిపోయారు. ఈక్రమంలో.. తాజాగా, ఎన్టీఆర్(NTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబంతో కలిసి వెకేషన్‌కు బయలుదేరాడు. ఇక ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు ఈ సమయంలో అవసరమా అన్నా అని అంటున్నారు. కాగా, ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ‘దేవర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్(Prashant Neel) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ వార్-2లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ రెండు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Next Story