- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హిట్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్న ఎన్టీఆర్.. అసలు విషయం లీక్ చేసిన కళ్యాణ్ రామ్! (వీడియో)

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం ప్రశాంత్ నీల్ (Prashanth Neel)దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అయితే మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ యంగ్ హీరో టొవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాను మూత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దీంతో పాటు తారక్ ‘వార్-2’ లోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా చేస్తున్న ఈ మూవీ వార్‌కు సీక్వెల్‌గా రాబోతుంది. అయితే ఈ రెండు సినిమాలు విడుదల కాకుండానే ఎన్టీఆర్ మరో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు టాక్. ఇటీవల ‘జైలర్’తో హిట్ కొట్టిన ఆయన తెరకెక్కిస్తున్న ఈ సినిమా డార్క్-యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే దీనికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ దీనిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి అయిన తర్వాత వార్-2 చేస్తారు. ఆ రెండు ప్రాజెక్ట్స్ తర్వాత ‘దేవర-2’ కూడా రాబోతుంది. ఈ మూడు అయిపోయాకే నెల్సన్ దర్శకత్వంలో వచ్చే మూవీ మొదలవుతుంది. ఇటీవల ఈ విషయాన్ని మా తమ్ముడు తారక్ ‘మ్యాడ్-2’ ఈవెంట్‌లో కూడా చెప్పారు’’ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ దేవర 2 చేయనున్నారు. ఆ తర్వాతనే నెల్సన్ తో సినిమా మొదలవుతుంది."
— Whynot Cinemas (@whynotcinemass_) April 14, 2025
"After Prashanth Neel's film, #NTR will do #Devara2. After that, a film with Nelson will take off."
– #NandamuriKalyanRam.#Dragon #NTRNelson pic.twitter.com/M0zoZId9n6