- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై పేరు వాడితే చర్యలే.. ఎన్టీఆర్ టీమ్ కీలక ప్రకటన
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదలైంది. ఇకపై ఎన్టీఆర్ పేరు వాడితే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదలైంది. ఇకపై ఎన్టీఆర్ పేరు వాడితే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా, అనధికారికంగా వాణిజ్య ప్రకటనల కోసం వాడుకున్నా చర్యలు తప్పవని తెలిపింది. దీనిపై ఇప్పటికే హైకోర్టు ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తూ ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. ఎన్టీఆర్ పేరును "NTR", "Jr. NTR", "NTR Jr.", "Tarak", "Nandamuri Taraka Rama Rao Jr.", "Jr. Nandamuri Taraka Rama Rao మరియు ఆయన బిరుదులు Man of Masses,Young Tiger లను సైతం అనధికారికంగా వినియోగించవద్దని స్పష్టం చేసింది.
ఎన్టీఆర్ ఫోటోలను దురుద్దేశంతో మీమ్స్, ఏఐ జెనరేటెడ్ కంటెంట్, మార్ఫ్డ్ ఇమేజెస్ లేదా ఇతర సాంకేతిక మార్గాల ద్వారా కూడా దుర్వినియోగం చేయవద్దని తెలిపింది. ఈ నిబంధనలు డిజిటల్ యుగంలో వ్యక్తిగత గుర్తింపు, కీర్తిని రక్షించడం యొక్క ప్రాధాన్యతను చూపిస్తున్నాయని పేర్కొంది. ఎవరైనా వీటిని ఉల్లంగిస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఇటీవల తన పేరును అనుమతి లేకుండా ప్రకటనల కోసం వినియోగించడం, వ్యక్తిగతంగా విమర్శించడంపై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.






