NTR : వార్-2 నుంచి అప్డేట్.. రంగంలోకి దిగిన ఎన్టీఆర్.. వైరల్‌గా వీడియో

by Chukka Sudharani |   (  Updated:2025-08-23 05:28:04  IST  )

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘వార్-2’ ఒకటి.

NTR : వార్-2 నుంచి అప్డేట్.. రంగంలోకి దిగిన ఎన్టీఆర్.. వైరల్‌గా వీడియో
X

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘వార్-2’ ఒకటి. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌(Hrithik Roshan)తో కలిసి ఎన్టీఆర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్న ఈ చిత్రానికి అయాన్ ముఖేర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహిస్తున్నాడు. 2019లో వచ్చిన ‘వార్’కు సీక్వెల్‌గా రూపొందిస్తున్న ఈ మూవీకి యష్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇప్పటికే ఈ మూవీ నుంచి ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అలాగే.. ఈ చిత్రంతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండటంతో.. వార్-2 (War 2) కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ స్పై యాక్షన్ డ్రామా ఆగస్టు 14న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ మూవీ కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తన క్యారెక్టర్‌కు సంబంధించిన డబ్బింగ్ పనులని మొదలు పెట్టాడు ఎన్టీఆర్. ‘డబ్బింగ్ బిగినింగ్’ (dubbing starts) అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story