NTR: బావమరిది పెళ్లిలో ఎన్టీఆర్ సంద‌డి...వీడియో వైర‌ల్‌

by velandi.Saikiran |   (  Updated:2025-10-10 17:42:57  IST  )

ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ పెళ్లి పీటలు ఎక్కాడు. తాజాగా శివాని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నార్నే

NTR:  బావమరిది పెళ్లిలో ఎన్టీఆర్ సంద‌డి...వీడియో వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ కుర్ర హీరో, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ( Narne Nithiin ) పెళ్లి పీటలు ఎక్కాడు. తాజాగా శివాని ( Lakshmi Shivani) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నార్నే నితిన్. ఇక వీళ్ళ వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే తాజాగా హీరో నార్నే నితిన్ వెడ్డింగ్ వేడుక కూడా అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. సాంప్రదాయ బట్టల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన సెలబ్రిటీలను కలుస్తూ, హడావిడిగా కనిపించారు.

అలాగే రాజీవ్ కనకాలతో కలిసి, నూతన జంటతో ఫోటో కూడా దిగారు. అటు ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీ ప్రణతి, ఆయ‌న‌ కుమారులు కూడా ఈ పెళ్లిలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా నెల్లూరుకు చెందిన శివానితో గత సంవత్సరం నవంబర్ మూడో తేదీన నార్నే నితిన్ ఎంగేజ్మెంట్ జరిగింది. శివాని ఫ్యామిలీకి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది పెళ్లికి పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. కాగా 2023 లో మ్యాడ్‌ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు నార్నే నితిన్. క్లిక్

Next Story