- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Balakrishna: ఎన్టీఆర్‌కు భారత రత్న రావాలి.. బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) ఇటీవల పద్మభూషణ్ అవార్డు (Padma Bhushan Award) అందుకున్న సంతగి తెలిసిందే.

దిశ, సినిమా: నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) ఇటీవల పద్మభూషణ్ అవార్డు (Padma Bhushan Award) అందుకున్న సంతగి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు హిందూపురంలో గ్రాండ్‌గా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఓ ఆర్టిస్టుగా పద్మభూషణ్ అవార్డు ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఙతలు తెలుపుకుంటున్నాను. మీకు చాలా ఆలస్యంగా పద్మభూషణ్ అవార్డు ఇచ్చారని చాలా మంది అంటున్నారు.. అయితే.. నాకు సరైన సమయంలోనే ఇచ్చారని నేను వాళ్లకు చెప్పాను. ఎందుకంటే.. నాన్నగారి శతజయంతి నిర్వహించుకోవడం, మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం, సినిమా పరంగా నాలుగు వరుస హిట్స్ అందుకోవడం, హీరోగా 50 ఏళ్లు పూర్తి కావడం.. నేను పద్మభూషణ్ అవార్డు అందుకోవడానికి ఇంతన్న మంచి టైమ్ మరోకటి ఉండదు అనుకుంటున్నాను. నాకు పద్మభూషణ్ ఇచ్చారు సరే సంతోషం.. కానీ నాకు ఒకటే ఉంది. ఎన్టీ రామారావు గారికి ‘భారత రత్న’ ఇచ్చినప్పుడే వాళ్లు వాళ్లకు గౌరవం ఇచ్చుకున్నట్టవుతుంది అని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. NTR గారికి భారత రత్న రావడం ప్రతి తెలుగు వాడి కోరిక’ అంటూ చెప్పుకొచ్చారు బాలకృష్ణ. కాగా.. గతేడాది జరిగిన ఏపీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరపున హిందూపురం (Hindupuram) ఎమ్మెల్యే (MLA)గా నందమూరి బాలకృష్ణ ఎన్నికైన సంగతి తెలిసిందే.






