NTR : ఫుల్ యాక్షన్‌గా ‘సామ్రాజ్యం’.. ఇది ఇప్పటికే స్పెషల్ అంటూ ఎన్టీఆర్ పోస్ట్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘వడ చెన్నై’ సూపర్ హిట్ అందుకుంది.

NTR : ఫుల్ యాక్షన్‌గా ‘సామ్రాజ్యం’.. ఇది ఇప్పటికే స్పెషల్ అంటూ ఎన్టీఆర్ పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘వడ చెన్నై’ సూపర్ హిట్ అందుకుంది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించాడు. తాజాగా వడ చెన్నైలో ఎవరికీ తెలియని కథ అంటూ మరో చిత్రాన్ని అనౌన్స్ చేశాడు వెట్రిమారన్. ఇందులో శింబు హీరోగా నటిస్తుండగా.. ప్రస్తుతం ‘STR-49’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటుంది.

ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా తెలుగు టైటిల్ ప్రోమోను టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. తమిళంలో ‘అరసన్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగులో ‘సామ్రాజ్యం’ పేరుతో విడుదల చేస్తు్న్నారు. ఇక ప్రోమోను గమనిస్తే.. నెత్తుటి మ‌ర‌క‌ల‌తో ఓ వ్యక్తిని చంపేసి వెళ్లే క్రమంలో ఓ నీళ్ల కొలాయి ద‌గ్గర మ‌ర‌క‌ల‌ను క‌డుక్కోవాల‌ని ఆగుతాడు శింబు. ఆ స‌మ‌యంలో మ‌రింత మంది వ‌స్తారు. అక్కడితో టైటిల్ ప్రోమో ముగుస్తుంది. ఈ ప్రోమోతో సినిమా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లో ఉండబోతున్నట్లు అర్థం అవుతుండగా.. ప్రజెంట్ ఈ ప్రోమో వైరల్ అవుతున్నది. లింక్


Next Story