2026 బాక్సాఫీస్ బరిలో ఎన్టీఆర్ సునామీ..డేట్ ఎప్పుడంటే..?

by Bhanu |   (  Updated:2025-04-29 09:02:00  IST  )

ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ -సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

2026 బాక్సాఫీస్ బరిలో ఎన్టీఆర్ సునామీ..డేట్ ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ -సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ ప్రకటనతో ఎన్టీఆర్ అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. గతంలో ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, నిర్మాతలు సరైన విడుదల కోసం వేచి చూశారు. వేసవి సెలవుల హడావిడి ముగిసిన తర్వాత, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేలా ఈ చిత్రాన్ని జూన్ 25న విడుదల చేయాలని నిర్ణయించారు. సంక్రాంతి సీజన్‌లో ఇతర పెద్ద సినిమాలు ఉండటంతో, పోటీని తప్పించి, సొంతంగా బాక్సాఫీస్‌ను షేక్ చేయాలనేది మేకర్స్ ప్లాన్‌గా కనిపిస్తోంది.

ఇంకా టైటిల్ ఖరారు కానప్పటికీ, ఈ కాంబినేషన్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ నీల్ తనదైన స్టైలిష్ మేకింగ్‌తో ఎన్టీఆర్‌ను ఎలా ప్రజెంట్ చేస్తారో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్సులు ఎమోషనల్ డ్రామాతో ఈ చిత్రం బాక్సాఫీస్‌ను కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్ 25, 2026న థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.

Next Story