- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NTR - Neel : 'డ్రాగన్'లో అఖిల్.. మూవీ యూనిట్ ఏమంటుందో తెలుసా?
NTR - Neel: అఖిల్ 'డ్రాగన్'లో నటించడం లేదని, అఖిల్, ప్రశాంత్ నీల్ గారు మంచి స్నేహితులు కావడం వల్ల అలాంటి వార్త వైరల్ అయి ఉంటుందని ఈ మూవీ బృందం వారు చెప్పినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రాలలో డ్రాగన్ ఒకటి. తారక్ ఇందులో హీరోగా నటిస్తుండగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఇద్దరికీ కూడా ఇండియా రేంజ్లో క్రేజ్ ఉండడం, ఈ సినిమా సూపర్ సాలిడ్ మాస్ సబ్జెక్టుతో తెరకెక్కుతూ ఉండడంతో ఈ కాంబోకి సంబంధించిన అనౌన్స్మెంట్ రాగానే దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే ఈ మధ్యకాలంలో ఓ వార్త వైరల్ అయింది.
అదేమిటంటే ఈ సినిమాలో అఖిల్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు, ఆయన పాత్ర నిడివి తక్కువే అయినా కథ మొత్తాన్ని మలుపుతిప్పే విధంగా ఉంటుంది. సూపర్ ట్విస్ట్ తో ఆయన పాత్ర వస్తుందని ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. దానితో తారక్ అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయ్యారు. తమ హీరోతోపాటు ఇంకో హీరో ఈ సినిమాలో భాగం కావడం, ఆయనకు మంచి పాత్ర ఉంది అనడంతో ఈ సినిమా మరో స్థాయికి వెళుతుంది అని వారు భావించారు.
కానీ ఈ వార్తలన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని డ్రాగన్ మూవీ యూనిట్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్, అఖిల్ మంచి స్నేహితులు. వారిద్దరూ తరచూ కలుస్తూ ఉండడం వల్ల ఈ సినిమాలో ఆయన నటిస్తున్నాడు అని వార్త వచ్చి ఉండొచ్చు. అంతకుమించి డ్రాగన్ సినిమాలో ఏ హీరో భాగం కాలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ గారు తారక్ పైనే పూర్తి దృష్టి పెట్టినట్లు ఈ మూవీ యూనిట్ చూపినట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది.






