- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాదా సాహేబ్ ఫాల్కే లుక్‌లో ఎన్టీఆర్.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే (Dadasaheb Phalke) బయోపిక్ చిత్రంలో నటించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రాజెక్టును రెండేళ్ల క్రితం ‘మేడ్ ఇన్ ఇండియా’ (Made In India) అనే పేరుతో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) సమర్పణలో డైరెక్టర్ నితిన్ కక్కర్ తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, త్వరలో వెల్లడిస్తామని అప్పట్లో తెలిపారు. ఇక తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నారనే వార్తలు రావటంతో ఇప్పుడీ ప్రాజెక్ట్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు, ఎన్టీఆర్‌ను దాదా సాహేబ్ ఫాల్కే లుక్‌లో AIతో రూపొందించి సోషల్ మీడియాలో పంచుకుంటూ వైరల్ చేస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే గెటప్‌లో ఖాదీ కుర్తా, మీసాలు, గడ్డంతో ఉన్న ఎన్టీఆర్ లుక్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ లుక్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.






